తెలంగాణ

telangana

ETV Bharat / international

విదేశీయులపై కరోనా వ్యాక్సిన్​ ప్రయోగానికి చైనా యోచన - china coronavirus tested abroad

కరోనా వైరస్​ కోసం వ్యాక్సిన్​ కనుగొనే పనిలో ఉన్న చైనా.. వైరస్​ కేంద్ర బిందువైన వుహాన్​లో ప్రయోగాలు ప్రారంభించింది. ఈ పరీక్షలు విజయవంతమైతే ఇతర దేశాల్లోనూ అదనపు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు ఆ దేశ పరిశోధకులు.

China's vaccine
కరోనా వ్యాక్సిన్

By

Published : Apr 2, 2020, 10:07 AM IST

కరోనా వైరస్​ను అరికట్టేందుకు చైనా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్​ ప్రయోగం వుహాన్​లో విజయవంతమైతే.. మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఇతర దేశాల్లోనూ అదనపు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ దేశ పరిశోధకులు తెలిపారు.

వ్యాక్సిన్ కోసం తొలి దశ క్లినికల్​ ట్రయల్​కు అధికారులు ఆమోదం పలకగా.. మార్చి 16న వుహాన్​లో పరీక్షలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రయోగం సజావుగా సాగుతోందని, ఫలితాలు ఏప్రిల్​లో వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్​ను చైనాలో ఉన్న విదేశీయులపైనా ప్రయత్నించినున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్​ను వైరస్​ ప్రభావం ఉన్న ఇతర దేశాల్లో ఉపయోగించే అవకాశం ఉన్నట్లు చైనా ఇంజినీరింగ్​ అకాడమీ సభ్యుడు చెన్​ వూయ్​ తెలిపారు.

సురక్షితమని తేలాలి

వ్యాక్సిన్ అభివృద్ధిలో చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి పరిశోధకులకు సహకరించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు చెన్​ వివరించారు. వ్యాక్సిన్ వినియోగం కోసం ఆమోదం ఎప్పుడు లభిస్తుందో తెలియదని, మొదట ఈ వ్యాక్సిన్​ సురక్షితమైందని నిర్ధరణ కావాలని అన్నారు.

ఇప్పటికే కరోనా వ్యాప్తి నియంత్రణకు చైనాలోని అనేక సంస్థలు వ్యాక్సిన్​ను కనుగొనే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. ప్రస్తుతానికి ఈ మహమ్మారికి ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు.

కరోనా ప్రభావం..

ప్రపంచవ్యాప్తంగా ఎగబాకిన ఈ వైరస్​.. ఇప్పటివరకు 47వేలమందిని పైగా బలికొంది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్​, అమెరికా తదితర దేశాల్లో ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ఇదీ చదవండి:మద్యం దొరక్క స్పిరిట్​ తాగి ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details