తెలంగాణ

telangana

ETV Bharat / international

జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం

వివాదాస్పద జాతీయ భద్రత చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టంతో చైనా భద్రతా ఏజెన్సీలు హాంకాంగ్​లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లభించనుంది.

china parliament
చైనా పార్లమెంట్

By

Published : May 28, 2020, 3:53 PM IST

హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాసే వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. వార్షిక సమావేశాల చివరి రోజులో భాగంగా చైనా ఈ బిల్లును ఆమోదించింది. దీంతో బిల్లు కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ ముందుకు వెళ్లనుంది. ఆగస్టు నాటికి ఇది చట్టంగా మారే అవకాశం ఉంది.

ఈ చట్టంతో చైనా భద్రతా ఏజెన్సీలు హాంకాంగ్​లో స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని విచారించే అధికారం చైనాకు లభించనుంది. హాంకాంగ్‌లో వేర్పాటువాదం, విధ్వంసం, విదేశీ జోక్యాన్ని నిషేధించడం వంటి అంశాలను బిల్లులో పొందుపర్చింది చైనా.

ప్రజల అభ్యంతరం

ప్రస్తుతం హాంకాంగ్ వాసులకు ఉన్న హక్కులకు విఘాతం కలిగించేదిగా ఉన్న ఈ చట్టంపై నిపుణులతో పాటు హాంకాంగ్ పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలంతా హంకాంగ్ నగర వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:రణరంగంగా మారిన హాంకాంగ్ చట్ట సభ

'భయం వద్దు'

అయితే హాంకాంగ్ అధికారులు మాత్రం చైనా తీసుకొచ్చిన చట్టాన్ని వెనకేసుకొస్తున్నారు. హాంకాంగ్​లో పెరుగుతున్న హింస, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఈ చట్టం అవసరమని చెప్పుకొస్తున్నారు. చట్టంపై భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:హాంకాంగ్​ హక్కులను హరించేలా చైనా కొత్త బిల్లు

ABOUT THE AUTHOR

...view details