తెలంగాణ

telangana

ETV Bharat / international

జిన్​పింగ్​ నియంత్రణలోకి చైనా సైనిక బలగాలు!

చైనా రిజర్వు సైనిక బలగాలు జులై 1 నుంచి అధ్యక్షుడు జిన్​పింగ్​ నియంత్రణలోకి వస్తాయని ఆ దేశ వార్త సంస్థ జిన్హువా తెలిపింది. మిలటరీలో సమన్వయ లోపాలను సవరించి, కేంద్ర నాయకత్వాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

China's military reserve forces brought under control of central leadership headed by Xi Jinping
జిన్​పింగ్​ నియంత్రణలోకి చైనా సైనిక బలగాలు!

By

Published : Jun 30, 2020, 5:04 AM IST

Updated : Jun 30, 2020, 6:38 AM IST

చైనా ప్రభుత్వం కీలక సైనిక సంస్కరణలు చేపట్టింది. చైనా రిజర్వు సైనిక దళాలను జులై 1 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ చైనా (సీపీసీ), సెంట్రల్​ మిలిటరీ కమిషన్​ (సీపీసీ)ల ఏకీకృత అధికారంలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండూ ప్రస్తుతం అధ్యక్షుడు జిన్‌పింగ్​ నేతృత్వంలో ఉన్నాయని జిన్హువా వార్త సంస్థ తెలిపింది. సైన్యంలోని సమన్వయ లోపాలను సరిచేయడమే దీని ఉద్దేశం. అంతే కాకుండా అధికార పార్టీ సంపూర్ణ నాయకత్వాన్ని నిర్ధరించడానికి, ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ రిజర్వు సాయుధ బలగాలు ద్వంద్వ నాయకత్వంలో ఉన్నాయి. స్థానిక కమ్యూనిస్ట్​ పార్టీ కమిటీలు, మిలటరీ నియంత్రణలో ఉన్నాయి. దీని వల్ల సమన్వయ లోపాలు తలెత్తుతున్నాయని... జులై 1 నుంచి అధికార పార్టీ నియంత్రణలోకి రానున్నట్లు జిన్హువా పేర్కొంది.

సైనిక సంస్కరణల్లో భాగమే..

మిలటరీ సంస్కరణల్లో భాగంగా రిజర్వు బలగాలను తగ్గిస్తూ.. కేంద్ర నాయకత్వ నియంత్రణలోకి తీసుకురావాలని 2017లో చైనా పీపుల్​ లిబరేషన్ ఆర్మీ(పీఎల్​ఏ) నిర్ణయం తీసుకుంది.

రిజర్వ్​ సైనిక దళాలను సంప్రదాయ యుద్ధం పద్ధతులకు భిన్నంగా సమాచార యుద్ధానికి తగినట్లుగా తీర్చిదిద్దారు.

ఇదీ చూడండి:పాక్ స్టాక్ మార్కెట్​పై దాడి- బలూచ్ ముష్కరుల పనే

Last Updated : Jun 30, 2020, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details