తెలంగాణ

telangana

ETV Bharat / international

'గల్వాన్'​ ఘర్షణలో చైనా సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ! - గల్వాన్ ఘటన

Galwan Clash: గల్వాన్​ లోయలో భారత్​తో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల ప్రాణ నష్టం అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువ ఉంటుందని ఆస్ట్రేలియా వార్తాపత్రిక తెలిపింది.

Galwan Clash 2020
'గల్వాన్'​ ఘర్షణలో చైనా సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ!

By

Published : Feb 3, 2022, 7:19 AM IST

India China Galwan Clash: 2020 గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో చైనాకు భారీ ప్రాణ నష్టం జరిగిందని ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఓ పరిశోధనాత్మక వార్తాపత్రిక పేర్కొంది. కానీ చైనా తమ వైపు తక్కువ ప్రాణ నష్టం జరిగినట్లుగా వెల్లడించిందని తెలిపింది. చైనాకు చెందిన సోషల్‌ మీడియా పరిశోధకులు, తాము కలిసి జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని స్పష్టం చేసింది.

ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు చనిపోయారని నివేదికలో వెల్లడించింది. కానీ చైనా తమ వైపు తక్కువ ప్రాణ నష్టం జరిగినట్లుగా గతేడాది ఫిబ్రవరిలో నివేదించింది. అయితే చీకట్లో సబ్‌జీరో నది దాటుతూ చనిపోయిన చైనా సైనికుల సంఖ్య అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువగా ఉంటుందని తాము జరిపిన పరిశోధనలో వెల్లడైందని తెలిపింది.

జూన్ 15, 2020న గాల్వాన్ వ్యాలీ ఘర్షణల తర్వాత తూర్పు లద్దాక్​ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:'ఇండియా ఒకటి కాదు రెండు- వాటి మధ్య అంతరాయం పెరుగుతోంది'

ABOUT THE AUTHOR

...view details