ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించగలిగే తొలి మానవరహిత చైనా హెలికాప్టర్ డ్రోన్ ఆకాశంలోకి ఎగిరింది. కాల్పులు జరపడం, ఎత్తు నుంచి నిఘా పెట్టడం వంటివి దీని ప్రత్యేకతలు. చైనా ఈ చాపర్‌ను భారత సరిహద్దు వెంబడి మోహరించే అవకాశముందని ఓ నివేదిక వెల్లడించింది.
మానవరహిత ఏఆర్500సీ హెలికాప్టర్.. టిబెట్‌లో భారత్‌తో ఉన్న చైనా సరిహద్దు భద్రతకు సహాయపడుతుందని ఆ దేశ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
గత బుధవారం.. తూర్పు చైనాలోని జింగ్షీ రాష్ట్రం నుంచి చేసిన ఈ డ్రోన్ ప్రయోగం విజయవంతమైంది. ఈ హెలికాప్టర్‌ను ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) రూపొందించింది.