తెలంగాణ

telangana

ETV Bharat / international

చిన్నారుల ఆన్​లైన్​ ఆటల​​ సమయంపై 'కర్ఫ్యూ'

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్​ మార్కెట్​గా పేరొందిన చైనా.. ఈ ఆటకు చిన్నారులు బానిసలు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ తరహా ఆటలపై వారు గడిపే సమయాన్ని కట్టడి చేయడానికి కర్ఫ్యూ విధించింది.

చైనాలో చిన్నారుల ఆన్​లైన్​ గేమ్స్​​ సమయంపై 'కర్ఫ్యూ'

By

Published : Nov 8, 2019, 5:11 AM IST

Updated : Nov 8, 2019, 7:30 AM IST

చిన్నారుల ఆన్​లైన్​ ఆటల​​ సమయంపై 'కర్ఫ్యూ'

ఆన్​లైన్​ ఆటలకు చిన్నారులు బానిసలు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న చైనా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ తరహా ఆటలపై వారు గడిపే సమయాన్ని కట్టడి చేయడానికి కర్ఫ్యూ విధించింది.

చైనా ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం 18 ఏళ్ల లోపు చిన్నారులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు ఆన్​లైన్​ గేమ్స్​​ ఆడటానికి వీల్లేదు. పగటి సమయంలో కూడా ఏకబిగిన 90 నిమిషాలకు మించి ఆడకూడదు. ఆన్​లైన్​ గేమ్స్​పై మైనర్లు వెచ్చించాల్సిన సొమ్ము నెలకు 28 డాలర్లకు మించడానికి వీల్లేదు.

16-18 ఏళ్ల వయసువారికి ఈ మొత్తాన్ని నెలకు 56 డాలర్లకు పరిమితం చేసింది ప్రభుత్వం. ఆన్​లైన్ గేమ్స్​ ఆడేవారంతా వాస్తవ పేరుతో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. ఫోన్​ నంబర్​ లేదా గుర్తింపు కార్డు నంబర్​తో సైనప్​ కావాల్సి ఉంటుంది. ఆన్​లైన్​ ఆటలకు చిన్నారులు బానిసలు కాకుండా చూడటానికి ఆటలోని నిబంధనలను మార్చాలని గేమ్​ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్​ మార్కెట్​గా చైనా ఉంది.


ఇదీ చూడండి: ఇరాక్ నిరసనలు​: సైన్యం కాల్పులతో ఉద్రిక్తత

Last Updated : Nov 8, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details