తెలంగాణ

telangana

ETV Bharat / international

'2027 నాటికి అమెరికాకు దీటుగా చైనా సైన్యం!' - china vs america latest news

ప్రపంచంపై ఆధిపత్యం కోసం పాకులాడుతున్న చైనా.. సైన్యాన్ని మరింత సమర్థంగా తయారుచేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2027 నాటికి అమెరికాకు దీటుగా సైన్యాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రణాళిక రచించింది.

PLA on par with US military by 2027
2027 నాటికి అమెరికాకు దీటుగా చైనా సైన్యం

By

Published : Nov 1, 2020, 7:39 PM IST

కరోనాతో ప్రపంచదేశాలన్నీ విలవిల్లాడుతుంటే... అందుకు కేంద్ర బిందువైన చైనా మాత్రం సరిహద్దు ఆక్రమణలు, సైనిక బలగాల పెంచుకొనేందుకు ప్రణాళికలు వేస్తోంది. 2027 నాటికి అమెరికాకు దీటుగా తమ సైన్యాన్ని సిద్ధం చేసుకొనేందుకు సిద్ధమవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ)ఈ మేరకు తీర్మానం చేసినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

అత్యాధునికంగా..

పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) ఏర్పాటై 2027 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. తమ సైన్యాన్ని పూర్తి స్థాయి అత్యాధునికంగా సిద్ధం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్లోబల్​ టైమ్స్​ తన కథనంలో పేర్కొంది. అధ్యక్షుడు జిన్​పింగ్​ నేతృత్వంలో నాలుగురోజులు జరిగిన 19వ సీపీసీ ప్లీనరీ సెషన్​లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వీటితో పాటు జాతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం 14వ పంచవర్ష ప్రణాళిక (2021-2025)ను రూపొందించింది అక్కడి ప్రభుత్వం. 2025 నాటికి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలను ఈ సమావేశంలో నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎగుమతులపై దృష్టి తగ్గించి దేశీయంగా మార్కెట్​ను పెంచుకోవాలని భావిస్తోంది చైనా.

సీపీసీ స్థాపకుడు మావో జెడాంగ్​ తర్వాత అత్యంత శక్తిమంతమైన​ నేతగా పేరు తెచ్చుకున్నారు 67 ఏళ్ల జిన్​పింగ్​. 2035 వరకు 15 ఏళ్లపాటు జిన్​పింగ్​ అధికారంలో ఉండనున్నారు. ఆయన ప్రస్తుతం అధ్యక్షుడుగానే కాకుండా సీపీసీ జనరల్​ సెక్రటరీగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details