తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆకాశవీధిలో 100ఎంబీపీఎస్​ నెట్- చైనా ప్రయోగం - china indegenous high speed in plane

పొరుగుదేశం చైనా సాంకేతిక పరిజ్ఞానంలో మరో అడుగు ముందుకేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన హైస్పీడ్ అంతర్జాల వ్యవస్థతో మొట్టమొదటి విమానాన్ని పరీక్షించింది.

china
విమానంలో హైస్పీడ్ అంతర్జాల వ్యవస్థను పరీక్షించిన చైనా

By

Published : Jul 8, 2020, 2:54 PM IST

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహం ద్వారా అంతర్జాల సదుపాయాన్ని కల్పించిన మొట్టమొదటి విమానాన్ని పరీక్షించింది చైనా. ఈ వినూత్న ఇంటర్నెట్ వ్యవస్థను క్వింగ్​డావో ఎయిర్​లైన్స్ విమానం క్యూడబ్ల్యూ 771లో ఉంచి పరిశీలించింది.

క్వింగ్​డావో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం చెంగ్డూ ష్వాంగ్లీయూలో దిగింది. ఈ ప్రయాణంలో 10,000 అడుగుల ఎత్తులో 100ఎంబీపీఎస్ స్పీడ్​తో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించారు. లైవ్ ప్రోగ్రాంలు వీక్షించారు.

హైత్రోపుట్ శాటిలైట్(హెచ్​టీఎస్) శ్రేణికి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఆధారంగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా విమానాల్లో కేయూ బ్యాండ్ సాయంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇందులో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే హెచ్​టీఎస్​ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేఏ బ్యాండ్​ను చైనా సమకూర్చుకున్న నేపథ్యంలో హైస్పీడ్ అంతర్జాల సేవలు గగనతలంలో అందుబాటులోకి వచ్చాయి.

ఇదీ చూడండి: 'హెచ్​సీక్యూను అమెరికాలో విపరీతంగా రాజకీయం చేశారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details