తెలంగాణ

telangana

క్యూ2లో నెమ్మదించిన చైనా ఆర్థిక వృద్ధి

By

Published : Jul 15, 2021, 6:26 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 7.9శాతం వృద్ధిని మాత్రమే చైనా నమోదు నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి 18.3శాతంగా ఉండటం గమనార్హం. కరోనా పరిస్థితుల వల్లే చైనా ఆర్థిక వద్ధి నెమ్మదించిందని నిపుణులు చెబుతున్నారు.

china economic growth
చైనా ఆర్థిక వృద్ధి

చైనాలో కరోనా అనంతర కాలంలో ఆర్థిక వృద్ధి నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి రికార్డుస్థాయిలో 18.3శాతంగా ఉంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సమయంలోనూ చైనా జీడీపీ 12.7శాతంగా నమోదైంది.

అయితే.. కరోనా నుంచి కోలుకున్నాక చైనాలోని అన్ని వ్యవస్థలు అనుకున్న స్థాయిలో పురోగమించకపోవడం వల్లే ఆర్థిక వృద్ధి నెమ్మదించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధభాగానికి పారిశ్రామిక ఉత్పాదక రేటు 15.9 శాతం పెరగడం సహా.. చిల్లర అమ్మకాలు 23శాతం పెరిగాయి. ఇదే సమయంలో నిరుద్యోగ రేటు 5శాతంగా నమోదైనట్లు చైనా ఆర్థిక గణాంక విభాగం పేర్కొంది. దేశ తలసరి ఆదాయం 12.6శాతం పెరిగినట్లు వివరించింది. నామినల్ టర్మ్స్‌లో తలసరి ఆదాయం 2 వేల 731 డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details