తెలంగాణ

telangana

ETV Bharat / international

అరుణాచల్‌ప్రదేశ్ ఉన్న మ్యాప్​లు సీజ్ చేసిన చైనా

అరుణాచల్​ప్రదేశ్ రాష్ట్రాన్ని భారత్​లో అంతర్భాగంగా చూపిస్తున్న మ్యాప్​లను చైనా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా అధికారిక మ్యాప్​కు అనుగుణంగా లేదన్న కారణంతో వాటిని సీజ్ చేశారు.

ARUNACHAL PRADESH
భారత్​లో భూభాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌

By

Published : Jul 31, 2021, 7:42 AM IST

షాంఘై పుడాంగ్‌ విమానాశ్రయం నుంచి 300లకు పైగా కన్‌సైన్‌మెంట్లలో విదేశాలకు పంపిస్తున్న వరల్డ్‌ మ్యాప్‌లను చైనా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత్‌కు చెందిన భూభాగంగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్‌లు అవి.

తమ దేశంలో ముద్రితమయ్యే మ్యాప్‌లన్నీ (విదేశాలకు ఎగుమతి చేసే వాటితో సహా) ప్రభుత్వ అధికారిక వైఖరికి అనుగుణంగానే ఉండాలని 2019లో చైనా ఆదేశాలు జారీ చేసింది. చైనా అధికారిక మ్యాప్​కు అనుగుణంగా లేని మూడు లక్షలకు పైగా పటా​లను ఆ ఏడాది ధ్వంసం చేసింది.

అరుణాచల్​ప్రదేశ్ రాష్ట్రంతో పాటు తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం తదితర ప్రాంతాలు తమ దేశానివేనని చైనా చెబుతోంది. దక్షిణ టిబెట్​లో అరుణాచల్​ప్రదేశ్ అంతర్భాగమని చెబుతోంది. అయితే, ఈ వాదనను భారత్ పూర్తిగా ఖండిస్తోంది.

ఇదీ చదవండి:వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే దేశార్థికానికి శిరోధార్యం

ABOUT THE AUTHOR

...view details