చైనాను హేళన చేసినా, అణచివేసేందుకు ప్రయత్నించినా చైనీయులు సహించరని హెచ్చరించారు అధ్యక్షుడు జిన్‌పింగ్. ఒకవేళ ఏ దేశమైనా అందుకు ప్రయత్నిస్తే 140 కోట్ల మంది చైనీయుల బలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దేశ సార్వభౌత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలన్న చైనీయుల సంకల్పాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని పేర్కొన్నారు. చైనా ఏ దేశాన్నీ లొంగదీసుకోవాలని, అణచివేయాలని ప్రయత్నించలేదని, అదే విధంగా విదేశాలు కూడా చైనాతో మసలుకోవాలని హితవు పలికారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతవసంతోత్సవాల సందర్భంగా బీజింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని కాపాడుకునేందుకు సైన్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జిన్‌పింగ్.
'తైవాన్ మాదే'
ఈ కార్యక్రమం సందర్భంగా తైవాన్ వివాదంపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.