తెలంగాణ

telangana

ETV Bharat / international

China BRI 'చైనా చేపట్టిన ఆ ప్రాజెక్ట్​తో పర్యావరణానికి ప్రమాదం' - ఐఎఫ్​​ఎఫ్​​ఆర్​ఎస్​ నివేదిక

చైనా చేపట్టిన బీఆర్​ఐ ప్రాజెక్ట్​తో(China BRI Project) ప్రపంచ పర్యావరణానికే పెద్ద ముప్పు ఏర్పడుతుందని ఓ అంతర్జాతీయ హక్కుల, భద్రతా సంస్థ తెలిపింది. విరివిగా కార్బన్​డయాక్సైడ్​ ఉపయోగించడం ద్వారా పర్యావరణ మార్పులకు అవకాశం ఉందని పేర్కొంది.

BRI
బీఆర్​ఐ ప్రాజెక్ట్

By

Published : Sep 7, 2021, 7:13 AM IST

Updated : Sep 7, 2021, 7:50 AM IST

పొరుగు దేశం చైనా చేపడుతున్న బెల్ట్​ రోడ్​ ఇనిషియేటివ్​(BRI) అనే పథకంతో పర్యావరణం దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో భారీగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. దీనిలో సుమారు 90 శాతం కార్బన్​ ఇంటెన్సివ్​, శిలాజ ఇంధనంతో పని చేస్తాయని పేర్కొన్నారు. పెద్దమొత్తంలో కార్బన్​డయాక్సైడ్​ను కాల్చడం ద్వారా పర్యావరణ మార్పులు మరింత తీవ్రంగా మారుతాయని అంతర్జాతీయ హక్కులు, భద్రతా సంస్థ (ఐఎఫ్​​ఎఫ్​​ఆర్​ఎస్​) శుక్రవారం తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్బన్​డయాక్సైడ్​​ ఉద్గారాలలో దాదాపు 46 శాతం బొగ్గును మండించడం ద్వారా వస్తున్నాయని తెలిపిన ఐఎఫ్​​ఎఫ్​​ఆర్​ఎస్.. గ్రీన్​ హౌస్​ ఎఫెక్ట్​కు కారణం అయ్యే వాయువులు మాత్రం 72 శాతం విద్యుత్ రంగం నుంచి వస్తున్నట్లు తెలిపాయి. చైనా పరిధిలో ఈ ప్రాజెక్ట్(China BRI Project)​ సుమారు ఐదు ఖండాల్లో విస్తరించి ఉంది. చైనా నియంత్రణ, పర్యావరణ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న కారణంగా... భూమిపై తీవ్రమైన , ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఎఫ్​ఎఫ్​ఏఎస్ అవేదన వ్యాక్తం చేసింది​.

ఇదీ చూడండి:6 నెలల తర్వాత 80 శాతం యాంటీబాడీలు మాయం!

Last Updated : Sep 7, 2021, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details