తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: చైనాకు 'మే డే' సెలవుల ముప్పు

చైనాలో లక్షణాలు కనిపించని కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా 25 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 981కు చేరుకుంది. మే డే సెలవుల్లో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశమున్న కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది.

VIRUS-CHINA
కరోనా కట్టడికి చైనాలో 'మే డే' సెలవులు

By

Published : May 1, 2020, 12:36 PM IST

చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. అయితే లక్షణాలు కనిపించని కేసులే అధికంగా నమోదవుతున్నాయి. చైనాలో శుక్రవారం 25 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 981కు చేరింది. వైరస్ వ్యాప్తి మొదలైన వుహాన్​లోనే 631 కేసులు నమోదయ్యాయి.

కార్మికుల దినోత్సవానికి 5 రోజుల పాటు సెలవులు ప్రకటించింది చైనా ప్రభుత్వం. వుహాన్​తో పాటు చైనాలో కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో సాధారణ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించింది. అయితే లక్షణాలు లేని కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఆందోళన మొదలైంది.

ప్రభుత్వం అప్రమత్తం..

5 రోజుల పాటు సెలవుల కారణంగా చాలా మంది ప్రయాణాలకు సిద్ధమయ్యారు. ప్రజారవాణా, హోటళ్లు, పర్యటక ప్రాంతాల్లో వ్యాధి సంక్రమణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అందరూ వ్యక్తిగత సంరక్షణ పరికరాలు ధరించాలని.. పెద్దఎత్తున ప్రజలు, పర్యటకులు గుమికూడవద్దని సూచించింది.

విదేశాల నుంచీ అధికమే..

పాజిటివ్​గా తేలిన కేసుల్లో 115 మంది విదేశాల నుంచి వచ్చినట్లుగా చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ (ఎన్​హెచ్​సీ) వెల్లడించింది. వీరందరితో సన్నిహితంగా ఉన్న మొత్తం 2,82,482 మందిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో 1,434 మందిని వైద్య పరిశీలనలో ఉంచారు.

దేశంలో సాధారణ కరోనా వైరస్ కేసులు శుక్రవారం 12 నమోదయ్యాయి. ఇందులో 6 స్థానికం కాగా.. మిగిలినవారు విదేశాల నుంచి వచ్చినట్లు తెలిపింది ఎన్​హెచ్​సీ. విదేశాల నుంచి వచ్చిన కేసులు 1,670కు చేరుకోగా.. ఇందులో 505 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

చైనాలో మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 82,874కు చేరింది. కరోనా ధాటికి 4633 మంది మరణించారు. 77,642 మంది కోలుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details