అంగారకుడిపై దిగిన చైనా ఉపగ్రహం తియాన్వెన్-1కు చెందిన రోవర్ జురోంగ్.. మార్స్ నుంచి ఫొటోలను, వీడియోలను పంపించింది. రోవర్ మార్స్ ఉపరితలాన్ని చేరుకోవడం, పారాచూట్ తెరుచుకోవడం మొదలైన దృశ్యాలను చిత్రీకరించింది. రోవర్ దిగుతున్న సమయంలో చేసిన శబ్దాలను కూడా రికార్డు చేసి పంపించింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ సీసీటీవీ ఫుటేజ్‌లను విడుదల చేసింది.
" ఈసారి విడుదల చేసిన ఫుటేజ్‌ల ఆధారంగా.. అంగారకుడి ఉపరితలంపై ఉన్న వాతావరణ మార్పులను పూర్తి స్థాయిలో అంచనా వేయగలం. మార్స్ రోవర్ ల్యాండర్ నుంచి విడిపోయినప్పుడు చేసిన శబ్దాల ఫుటేజ్ కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది."
--లియ్ జిఝాంగ్, డిప్యూటీ కమాండర్.