ప్రపంచాన్ని కకావికలం చేస్తోన్న కరోనా మహమ్మారి పుట్టుక గురించి తెలుసుకునేందుకు ప్రణాళికలు రూపొందించే విషయంపై చైనా-ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించాయి. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి నుంచి ఇద్దరు నిపుణులు తమ దేశంలో రెండు వారాలు పర్యటించారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. వైరస్ మూలానికి సంబంధించి శాస్త్రీయ పరిశోధన సహకారంపై సన్నాహక సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు.
ఐరాస నిపుణులతో జనాభా, పర్యావరణం, అణువులు, జంతువులను గుర్తించడం, వైరస్ వ్యాప్తికి సంబంధించిన విషయాలపై చర్చించినట్లు వాంగ్ చెప్పారు.