" భారత్, పాకిస్థాన్ ప్రధానుల మధ్య జరిగిన సందేశాలను మేం స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతమయ్యేందుకు మద్దతు పలుకుతున్నాం. ఉద్రిక్త పరిస్థితులు తగ్గేందుకు చైనా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది." - జెంగ్ షుయాంగ్, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి.
మోదీ-ఇమ్రాన్‌ల మధ్య సందేశాలను స్వాగతించిన చైనా - చైనా
పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ల పరస్పర సందేశాలను స్వాగతించింది చైనా. ఇవి ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గిస్తాయని అభిప్రాయపడింది.
మోదీ-ఇమ్రాన్‌ల మధ్య సందేశాలను స్వాగతించిన చైనా
భారత్-పాక్‌ల మధ్య సంబంధాల బలోపేతానికి చైనా పాత్ర ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని పేర్కొన్నారు జెంగ్. ఈ రెండు దేశాలు దక్షిణాసియాలో ముఖ్యమైనవని తెలిపారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరు దేశాలు... సమస్యలను పరిష్కరించుకుంటాయనే నమ్మకముందని చెప్పారు.