అమెరికా-చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికాలోని మరో నాలుగు చైనా మీడియా సంస్థలను 'విదేశీ మిషన్స్' జాబితాలో చేర్చటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీజింగ్. అగ్రరాజ్యం తీరు మార్చుకోకుంటే ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగంపై విమర్శలు గుప్పించారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్.
" చైనా మీడియాపై అమెరికా రాజకీయ అణచివేతకు తాజా నిర్ణయమే ఉదాహరణ. అది పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న అమెరికా నిబద్ధతను కాలరాస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, పక్షపాత ధోరణిని మానుకోవాలని అమెరికాను కోరుతున్నాం. ఎవరికీ ఉపయోగంలేని తప్పుడు పద్ధతిని వెంటనే ఆపి.. సరిదిద్దుకోవాలి. లేనిపక్షంలో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది."