తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​ను దెబ్బకొట్టేందుకు​ చైనా కొత్త ఎత్తులు' - యార్లుంగ్​ జాంగ్​బోర్​ నది

భారత్​కు వ్యతిరేకంగా నీటిని చైనా ఆయుధంగా వాడాలనుకుంటోందని హైడ్రోజియోలజిస్ట్ రితేశ్ ఆచార్య ఆందోళన వ్యక్తంచేశారు. చైనా చేపడుతోన్న సూపర్​ డ్యాం నిర్మాణం ద్వారా ఈశాన్య భారత నీటి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు.

China wants to use water as weapon, super dam
భారత్​పై ఆయుధంగా నీరు, సూపర్​ డ్యాం

By

Published : Apr 16, 2021, 10:42 PM IST

టిబెట్​లోని యార్లుంగ్​ జాంగ్​బోర్​ నదిపై వాస్తవాదీన రేఖ సమీపంలో చైనా చేపడుతున్న సూపర్​ డ్యాం నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ హైడ్రోజియోలజిస్ట్ రితేశ్ ఆచార్య. ఈ ఆనకట్ట ద్వారా నీటిపై ఆధిపత్యం సాధించి, దానిని భారత్​కు వ్యతిరేక ఆయుధంగా వాడాలని చైనా కుట్ర పన్నుతోందని చెప్పారు. సూపర్​ డ్యాంతో ఈశాన్య భారత నీటి భద్రతపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

"అంతర్జాతీయ నదుల పరంగా భారత్​ కన్నా చైనాకు అనుకూల పరిస్థితులున్నాయి. విద్యుత్ ఉత్పత్తి, సాగు కోసం ఆనకట్టలు కడుతున్నట్లు చైనా చెబుతోంది. వాస్తవానికి.. నీటిని నియంత్రించి, భారత్​పై ఆయుధంగా వాడాలనుకుంటోంది."

-రితేశ్ ఆచార్య, హైడ్రోజియోలజిస్ట్

టిబెట్​లో ఆవిర్భవించిన యార్లుంగ్. అరుణాచల్ ప్రదేశ్​లో సియాంగ్​గా.. అసోంలో బ్రహ్మపుత్రగా.. పారి బంగ్లాదేశ్​లోకి ప్రవేశిస్తుంది. చైనాలోని త్రీ జార్జెస్ డ్యాం.. ప్రపంచంలోనే అతిపెద్ద పవర్​ స్టేషన్. దానికి మూడింతల సామర్థ్యంతో ఈ సూపర్​ డ్యాంను నిర్మించాలని డ్రాగన్ ప్రణాళిక రచిస్తోంది.

ఇదీ చూడండి:చైనా హై జంప్- క్యూ1లో 18.3% వృద్ధి రేటు!

ABOUT THE AUTHOR

...view details