భారత్-పాకిస్థాన్ సత్సంబంధాలు కలిగి ఉండాలని, శాంతి, సుస్థిరతలను పెంపొందించడానికి ఇరుదేశాలు చేతులు కలపాలని.. చైనా కోరుకుంటున్నట్లు భారత్‌లోని ఆ దేశ రాయబారి సన్ వీడాంగ్ పేర్కొన్నారు. చైనా-భారత్‌ల మధ్య కూడా చర్చలు మరింత పురోగతి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపఖండం అభివృద్ధికి భారత్-చైనా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఇటీవల జరిగిన రెండో అనధికారిక చర్చల తరువాత సన్ వీడాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"చైనా-భారత్, చైనా-పాకిస్థాన్, భారత్-పాక్‌ల మధ్య మంచి సంబంధాల కోసం హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నామని చైనా నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి ఇరుదేశాలు కృషిచేయాలని, ప్రాంతీయ అభివృద్ధి, శ్రేయస్సు కోసం దాయాది దేశాలు చేతులు కలపాలని మేము ఆశిస్తున్నాం."- సన్ వీడాంగ్, భారత్‌లోని చైనా రాయబారి
'పుల్వామా'తో మొదలైంది...
జమ్ముకశ్మీర్ పుల్వామాలో పాక్ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఫలితంగా భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానికదళం దాడి చేసి నాశనం చేసింది. దీనిపై పాకిస్థాన్ తనపైన జరిగిన దాడిగా అభివర్ణించింది.
ఆర్టికల్ 370 రద్దుతో