తెలంగాణ

telangana

ETV Bharat / international

'తైవాన్​కు ఆయుధాలు అమ్మితే ప్రతీకారం తథ్యం' - china latest news

బిలియన్​ డాలర్లు విలువచేసే ఆయుధాలను తైవాన్​కు అమ్మాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామం అమెరికా- చైనా సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

China vows retaliation if US proceeds with Taiwan arms sale
'తైవాన్​కు ఆయుధాలు అమ్మితే ప్రతీకారం తప్పదు'

By

Published : Oct 23, 2020, 12:55 PM IST

తైవాన్​కు బిలియన్​ డాలర్ల విలువ చేసే అత్యాధునిక ఆయధాలను అమ్మేందుకు అంగీకారం తెలిపిన అమెరికాపై చైనా మండిపడింది. అలా చేస్తే అగ్రరాజ్యంపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది​. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

చైనా- అమెరికా మధ్య తీవ్రమైన పరిణామాలను నివారించేందుకు, జలసంధిలో శాంతి నెలకొల్పేందుకు అగ్రరాజ్యం- తైవాన్​ మధ్య జరిగిన ఆయుధ అమ్మకాల ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేసింది బీజింగ్.

అమెరికా- చైనా మధ్య సంబంధాలను తాజా పరిణామం మరింత క్షీణించేలా చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ఆ రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో సంబంధాలు ఎప్పుడూ దెబ్బతినలేదని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details