ప్రాణాంతక కరోనా వైరస్‌తో చైనా అతలాకుతలమవుతోంది. మహమ్మారి ధాటికి హుబే ప్రావిన్స్‌లో తాజాగా 100మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం వల్ల మృతుల సంఖ్య 1765కు చేరింది. 1,933 నూతన కేసులు నమోదైనట్టు చైనా ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు 70,400 మందికి ఈ వైరస్ సోకినట్టు స్పష్టం చేసింది.
వైరస్ కేంద్ర బిందువైన వుహాన్ మినహా.. చైనావ్యాప్తంగా వైరస్ కేసులు తగ్గుతున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే కరోనా ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో చెప్పలేమని.. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించింది.