ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటి వరకు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న హుబె రాష్ట్రంలో తాజాగా 132 మంది వైరస్‌కు బలయ్యారు.
కరోనా పంజా: చైనాలో 2 వేలకు చేరిన మృతులు - కరోనా లేటెస్ట్ అప్డేట్
చైనాలో కరోనా మహమ్మారికి మరో 132 మంది బలయ్యారు. వీరితో కలిపి బుధవారం నాటికి కరోనా బాధితుల మరణాల సంఖ్య 2,000కు చేరింది. చైనాలో కరోనా సోకిన వారి సంఖ్య 74,000 దాటింది.
కరోనా వైరస్ మృతుల సంఖ్య
చైనా రోజువారీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 1,693 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. వీరితో కలిపి చైనాలో వైరస్ సోకిన వారి సంఖ్య 74,000 దాటింది.
మంగళవారంతో పోలిస్తే కరోనా బాధితుల మరణాలు బుధవారం కాస్త పెరిగాయి. ఇదే సమయంలో హుబె రాష్ట్రంలో కొత్త కేసులు వారంలోనే అత్యల్పంగా నమోదయ్యాయి.
Last Updated : Mar 1, 2020, 7:23 PM IST