కరోనా విజృంభణ కొనసాగుతోంది. మృత్యుఒడిని చేరుకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. వ్యాధికి ప్రధాన కేంద్రంగా నిలిచిన చైనాలో వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 490కి చేరింది.
హుబె ప్రావిన్స్లోనే 24 గంటల వ్యవధిలో 65 మంది ప్రాణాలు కోల్పోవటం తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు 20 వేల మందికిపైగా ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా మరో 3,156 మందికి వైరస్ సోకిట్లు అధికారిక ప్రకటన చేసింది డ్రాగన్ ప్రభుత్వం.