తెలంగాణ

telangana

కరోనా: చైనాలో 1,860కి చేరిన మృతులు

By

Published : Feb 18, 2020, 5:57 AM IST

Updated : Mar 1, 2020, 4:42 PM IST

కరోనా వైరస్​ మహమ్మారి వల్ల చైనాలో 1,860మంది మరణించారు. మృతుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ... ప్రపంచదేశాల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.

China virus death toll passes 1,800: govt
చైనా: కరోనా వైరస్​తో 1800కుపైగా మృతి

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్​ ధాటికి 1800కుపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను చైనా తన రోజువారీ నివేదికలో పేర్కొంది. మృతుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గుతున్నప్పటికీ.. ప్రపంచదేశాల్లో వైరస్​పై ఉన్న భయం వీడటం లేదు.

తాజాగా వైరస్​ కేంద్రబిందువైన హుబె రాష్ట్రంలో 93మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 1,860కి చేరింది.

డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరికలు...

వైరస్​ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కంటితుడుపు చర్యలు తగవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని హితవు పలికింది.

యాపిల్​ ఉత్పత్తులు కట్​...

కరోనా వైరస్​ ప్రభావం దిగ్గజ యాపిల్​ సంస్థపైనా పడింది. రెండో త్రైమాసిక ఆర్థిక మార్గదర్శకాలను అందుకోలేకపోతున్నట్టు పెట్టుబడిదారులను హెచ్చరించింది. చైనాలో ఐఫోన్​ ఉత్పత్తులు లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. చైనాలో ఐఫోన్​కున్న డిమాండ్​ కూడా పడిపోయిందని పేర్కొంది.

Last Updated : Mar 1, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details