ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కొవిడ్-19 (కరోనా) వైరస్. వ్యాధి కేంద్రస్థానమైన చైనాలో గురువారం ఒక్కరోజే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాంతక మహమ్మారి ధాటికి మొత్తంగా 1483 మంది అసువులు బాశారు. 4823 నూతన కేసులు నమోదయ్యాయని.. మొత్తంగా 64,600 మందికి వ్యాధి లక్షణాలు నిర్ధరణ అయినట్లు వెల్లడించారు.
కరోనా కల్లోలం: చైనాలో 1483కు చేరిన మృతుల సంఖ్య - covid 19
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్-19 (కరోనా) వైరస్ కారణంగా చైనాలో గురువారం ఒక్కరోజే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 1483 కు చేరింది. నూతనంగా 4823 మంది కొవిడ్ బారిన పడ్డారని సమాచారం.
![కరోనా కల్లోలం: చైనాలో 1483కు చేరిన మృతుల సంఖ్య covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6065948-thumbnail-3x2-corona.jpg)
కొవిడ్ 19తో ఒక్కరోజే 116మంది మృతి
సరైన సమయంలో చికిత్స అందించేందుకు వీలుగా వ్యాధి నిర్ధరణ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు హూబీ అధికారులు. అయితే చైనా అధికారులు ప్రకటించిన దానికంటే ఎక్కువగానే వ్యాధి ప్రబలుతోందని సమాచారం.
ఇదీ చూడండి:కొవిడ్-19 భయాలున్నా నౌకకు ఆహ్వానం.. ఆ దేశానికి సలాం!
Last Updated : Mar 1, 2020, 7:05 AM IST