చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌తో రోజురోజుకు మృత్యుఘోష పెరుగుతూ పోతోంది. ఈ వైరస్ బారిన పడి మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా డ్రాగన్ దేశంలో కరోనా మృతుల సంఖ్య 106కు చేరింది. ఇప్పటికే 2,744 మంది చికిత్స పొందుతుండగా కొత్తగా మరో 1,300 కేసులను గుర్తించినట్లు చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4వేలు దాటింది.
శాంతించని కరోనా.. చైనాలో 106కు చేరిన మృతులు - శాంతించని కరోనా.. చైనాలో 106కు చేరిన మృతులు
చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 106కు చేరింది. సోమవారం నాటికి 82 మంది చనిపోగా తాజాగా మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా వ్యాప్తంగా మరో 4వేల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
శాంతించని కరోనా.. చైనాలో 106కు చేరిన మృతులు
చైనాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. తాజాగా శ్రీలంక, కెనడాకు కూడా వ్యాపించింది. ఈ సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాణాంతక కరోనాతో ప్రపంచానికి ముప్పు ఎక్కువేనని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
Last Updated : Feb 28, 2020, 5:42 AM IST
TAGGED:
Gangadhar Y