విదేశీ పాత్రికేయులను అణచి వేసేందుకు జాతీయ భద్రతా విధానాలను, నిఘా వ్యవస్థలను చైనా ప్రభుత్వం వినియోగిస్తోంది. దీని ద్వారా వారిని వేధింపులకు గురి చేసేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు 'నేషనల్ రివ్యూ'కు రాసిన వ్యాసంలో జియాన్లి అనే ఓ రాజకీయ ఖైదీ పేర్కొన్నారు. విదేశి పాత్రికేయులపై నిఘా ఉంచడంలో చైనాకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని విమర్శించారు. గతేడాది కూడా కరోనా వైరస్ విషయంలో విదేశీ పాత్రికేయులకు చైనా ప్రభుత్వం ఎలాంటి మినహాయింపును ఇవ్వలేదని తెలిపారు.
"చైనాలో విధులు నిర్వర్తించే విదేశీ పాత్రికేయులపై నిఘా పెట్టడంలో చైనా ప్రభుత్వానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గతేడాది కరోనా వ్యాప్తి సమయంలోనూ వారిపై నిఘాను కొనసాగించింది. విదేశీ పాత్రికేయులకు వైరస్ సమాచారం చిక్కుకుండా దేశ నిఘా వ్యవస్థను, జాతీయ భద్రతా విధానాలను చైనా ప్రభుత్వం వినియోగించింది."