అమెరికా, చైనా తమ మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల తెగదెంపులపై చర్చిడం సాధ్యం కాదని చైనాకు చెందిన ఓ అధికారి అన్నారు. ఇది వాస్తవికమైనది కాదని, దీనితో ఇరు దేశాలకు లేదా ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
సీపీసీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ హన్ వెన్జియూ.. చైనా, అమెరికా సంబంధాలపై మాట్లాడారు. ఆయా దేశాల ఆర్థిక నిర్మాణాన్ని సంతృప్తిపరచటంపై రెండు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు.
"సంబంధాల తెగదెంపులను కోరుకునే వారి సంఖ్య చాలా స్వల్పం. ఇరు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించాలని కోరుకునే వారే అధికంగా ఉన్నారు. ఆర్థిక సంబంధాలను పూర్తి స్థాయిలో తగ్గించటం సాధ్యమయ్యే పని కాదు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. కరోనా సమయంలోనూ అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరిమాణం 16 శాతం పెరిగింది."