వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా, చైనా అధినేతలు డొనాల్డ్ ట్రంప్, షి జిన్పింగ్ అంగీకరించారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తాసంస్థ 'జినువా' తెలిపింది. అంతేకాకుండా చైనా ఎగుమతులపై సుంకాలను నిలిపివేసేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారని పేర్కొంది. రెండు దేశాల మధ్య సమానత్వం, పరస్పర గౌరవం కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జపాన్లో జరిగిన జీ-20 సమావేశంలో భాగంగా జిన్పింగ్, ట్రంప్ భేటీ అయ్యారు.