ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్ 'ది బైహేతన్'ను చైనా ప్రారంభించింది. ఈ ఆనకట్టలో మొత్తం 16 యూనిట్లు ఉండగా.. తొలి విడతగా రెండు యూనిట్లను సోమవారం ప్రారంభించినట్లు చైనా ప్రకటించింది.
289 మీటర్ల ఎత్తులో..
ఈ డ్యామ్‌ను యాంగ్జే నదికి ఉపనది అయిన జిన్షా నదిపై నిర్మించారు. ఈ డ్యాం ఎత్తు 289 మీటర్లు ఉంది. మొత్తం 16 యూనిట్లు ఉండగా.. ఒక్కో యూనిట్ 1 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట త్రీ గోర్జెస్ డ్యామ్‌ను 2003లో యాంగ్జే నదిపై నిర్మించింది చైనా ప్రభుత్వం. ఈ రెండు డ్యామ్‌లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన త్రీ గోర్జెస్ కార్పొరేషన్ నిర్మించింది.