తెలంగాణ

telangana

ETV Bharat / international

వాణిజ్య యుద్ధం: అమెరికాపై చైనా సుంకాల మోత

ప్రపంచంపై ఆర్థిక మాంద్యం కోరలు చాచినా.. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి మాత్రం తెరపడడం లేదు. తాజాగా.. 75 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు.. చైనా ప్రకటించింది.

By

Published : Aug 24, 2019, 5:51 AM IST

Updated : Sep 28, 2019, 1:52 AM IST

వాణిజ్య యుద్ధం: అమెరికాపై చైనా సుంకాల మోత

వాణిజ్య యుద్ధం: అమెరికాపై చైనా సుంకాల మోత

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తీవ్రరూపం దాల్చినప్పటికీ ఈ యుద్ధాన్ని కట్టడి చేసేందుకు ఇరు దేశాలు ఏమాత్రం చొరవ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు.

అగ్రరాజ్యానికి చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు డ్రాగన్​ దేశం శుక్రవారం ప్రకటించింది. 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలన్న అమెరికా నిర్ణయానికి ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

చైనా నిర్ణయంపై మండిపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా కంపెనీలు చైనాను విడిచి వచ్చేయాలని కోరారు. చైనా అవసరం తమకు లేదని ఆ దేశం దూరంగా ఉంటేనే తమకు మరింత బాగుంటుందని ట్వీట్ చేశారు.

తమ దేశం మూర్ఖంగా చైనాకు ట్రిలియన్ డాలర్లను కోల్పోయిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏటా వందల బిలియన్లు విలువచేసే తమ మేథో హక్కులను చైనా దొంగలించిందని ఆరోపించారు. అదే కొనసాగాలని చైనా కోరుకుంటోందన్న ట్రంప్‌.. వారి ఆటలు సాగనివ్వబోమని ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికా కంపెనీలను వెంటనే చైనాకు ప్రత్యామ్నాయం చూసుకొని.. స్వదేశానికి వచ్చేయాలని కోరారు.

Last Updated : Sep 28, 2019, 1:52 AM IST

ABOUT THE AUTHOR

...view details