తెలంగాణ

telangana

ETV Bharat / international

వారి త్యాగాలకు గుర్తుగా చైనాలో సంతాప దినం

కరోనాపై యుద్ధంలో ప్రాణాలు త్యాగం చేసినవారి స్మృత్యర్థం శనివారాన్ని సంతాప దినంగా ప్రకటించింది చైనా. కరోనా బారిన పడి మరణించిన 3,300 మందికి ప్రజలంతా నివాళులు అర్పించారు. రోడ్లపై వాహనాలు మూడు నిమిషాల పాటు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.

China
చైనా

By

Published : Apr 4, 2020, 8:26 AM IST

Updated : Apr 4, 2020, 8:52 AM IST

వారి త్యాగాలకు గుర్తుగా చైనాలో సంతాప దినం

కరోనాపై పోరాడి అమరులైన వారికి గుర్తుగా శనివారం సంతాపదినంగా ప్రకటించింది చైనా. కరోనా వైరస్​ను మొదటగా గుర్తించి.. అనంతరం అదే మహమ్మారికి బలైన డాక్టర్ లీ వెన్లియాంగ్​నూ స్మరించుకున్నారు ఆ దేశ ప్రజలు. ఆయనతో పాటు కరోనా బారిన పడి మృతి చెందిన 3,300 చైనీయులకు సంతాపం తెలిపారు.

3 నిమిషాల పాటు మౌనం..

దేశవ్యాప్తంగా చైనా ప్రజలు కరోనా బాధితుల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ.. శనివారం ఉదయం 3 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సమయంలో వైమానిక దాడిలో ఉపయోగించే సైరన్లు, వాహనాలు, రైళ్లు, ఓడల హారన్లను మోగించారు. ఫలితంగా రోడ్లపై వాహనాలు కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

చైనాలో 3 వేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. అధికారిక లెక్కల ప్రకారం వైద్యులతో సహా సిబ్బందిలో 10 మంది చనిపోయారు. ఇందులో కరోనాను తొలుత గుర్తించిన కంటి వైద్యులు లీ వెన్లియాంగ్ కూడా ఉన్నారు.

ఇదీ చూడండి:వైద్యుల సహృదయం.. రోగికి పుట్టినరోజు వేడుకలు

Last Updated : Apr 4, 2020, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details