అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు మధ్య, దక్షిణాసియా దేశాధినేతలతో వర్చువల్ భేటీ నిర్వహించనున్నట్లు చైనా(China Afghan) తెలిపింది. ఈ సమావేశాన్ని చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థ.. గురువారం నిర్వహించనుంది. అయితే ఇందులో పరిశీలక సభ్య దేశమైన అఫ్గాన్‌లో ఇటీవల తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని(Taliban government) గుర్తించడంపై.. చైనా(china Afghanistan relations) స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాలిబన్(Taliban news) ప్రతినిధిగా ఎవరు హాజరవుతారనే దానిపై స్పష్టత లేదు.
అయితే అఫ్గాన్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొనడానికి అమెరికా కారణమని చైనా ఆరోపిస్తోంది. హడావిడా బలగాల ఉపసంహరణతో(US army in Afghanistan) తాలిబన్లు అఫ్గాన్‌ని ఆక్రమించుకున్నారని వ్యాఖ్యానించింది.