తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2022, 8:12 PM IST

ETV Bharat / international

భారత్​ కన్నా 3రెట్లు ఎక్కువగా చైనా రక్షణ బడ్జెట్‌!

China Military Budget: ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనా.. రక్షణ బడ్జెట్​ కేటాయింపులను భారీగా పెంచింది. భారత రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే అది దాదాపు మూడింతలు ఎక్కువ.

China Military Budget
China Defence Budget

China Military Budget: వార్షిక రక్షణ బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టిన చైనా.. కేటాయింపుల్ని గణనీయంగా పెంచింది. క్రితం ఏడాదితో పోలిస్తే 7.1 శాతం నిధుల్ని పెంచి 230 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.17.5 లక్షల కోట్లు) కేటాయించింది. భారత రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు. ఈ మేరకు శనివారం అక్కడి 'నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్ (ఎన్​పీసీ)‌'లో ప్రీమియర్‌ లీ కెఖియాంగ్‌ రక్షణ బడ్జెట్‌ ప్రతిపాదనల్ని ప్రవేశపట్టారు.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. కేటాయింపుల్ని గణనీయంగా పెంచడం గమనార్హం. దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధిని కాపాడేందుకు 'పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్​ఏ)' దృఢమైన, అనువైన రీతిలో సైనిక పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని లీ కెఖియాంగ్‌ అన్నారు. రక్షణ బడ్జెట్‌తో పాటు చైనా ప్రత్యేకంగా 'అంతర్గత భద్రతా బడ్జెట్‌'ను కూడా ప్రవేశపెడుతుంటుంది. దీనికి రక్షణ శాఖ కంటే అధిక కేటాయింపులు చేస్తుంటుంది.

ఏటా పెంపుదల..

2017లో 2.3 కోట్ల మంది సైనికులున్న చైనా ఆర్మీ.. ప్రస్తుతం 2 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ.. ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థ చైనాదే. ఇక ప్రపంచంలో దేశ రక్షణకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో చైనా రెండో స్థానంలో ఉంది. ఈ విషయంలో 600 బిలియన్‌ డాలర్లతో అమెరికా ముందుంది. ఇక 2021లో తొలిసారి చైనా రక్షణ బడ్జెట్‌ 200 బిలియన్‌ డాలర్లు దాటింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6.8 శాతం అధికం.

2012లో చైనా అధ్యక్ష పగ్గాలు షీ జిన్‌పింగ్‌ స్వీకరించిన తర్వాత రక్షణశాఖకు భారీ ఎత్తున కేటాయింపులను పెంచుతూ వస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మిలిటరీ వ్యవస్థను అన్ని రంగాల్లో ఆధునికీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సైన్యాన్ని తగ్గించి నావికాదళం, వాయుసేన ప్రాధాన్యాన్ని పెంచారు.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​, రష్యా యుద్ధం- ఎవరి బలం ఎంత?

ABOUT THE AUTHOR

...view details