తెలంగాణ

telangana

ETV Bharat / international

త్వరలో చైనా ప్రజలకు కరోనా టీకా పంపిణీ

త్వరలో తమ దేశ ప్రజలకు కొవిడ్​ టీకా ఇవ్వనున్నట్లు చైనా వెల్లడించింది. తొలి ప్రాధాన్యం మాత్రం వైద్య, ఆరోగ్య కార్యకర్తలకు ఉంటుందని స్పష్టం చేసింది.

China to begin COVID-19 inoculations with front-line workers
ఇక రవాణారంగంలో ఉన్నవారివొంతు: చైనా

By

Published : Dec 19, 2020, 2:12 PM IST

త్వరలో తమ దేశ ప్రజలకు కొవిడ్ టీకా​లు ఇవ్వనున్నట్లు చైనా ప్రకటించింది. కరోనాపై పోరులో ముందుండి నడిపిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది. వైద్య, ఆరోగ్య కార్యకర్తలతో పాటు రవాణా రంగంలోని వారికి, సరిహద్దు భద్రతాదళాలకు టీకా ఇవ్వనున్నట్లు జాతీయ ఆరోగ్యకమిషన్​ ఉపమంత్రి జెంగ్​ యీ షిన్​ వెల్లడించారు.

అయితే టీకా అత్యవసర వినియోగం కింద ఇప్పటికే మిలియన్ల మందికి వ్యాక్సిన్​ అందించింది చైనా. ఇందుకు సంబంధించి సినోవాక్, సినోఫార్మ్ సంస్థలకు పలు నెలల ముందే అనుమతులిచ్చింది. అయితే చైనా తయారుచేసిన కరోనా టీకాలపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తుది దశ ట్రయల్స్ గురించి చైనా సమాచారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.​

మరోవైపు చైనా కరోనా టీకాలకు అత్యవసర అనుమతినిచ్చిన రెండో దేశంగా బహ్రైన్​ నిలిచింది. అంతకు ముందు యూఏఈ అనుమతినిచ్చింది. టర్కీ, ఇండోనేషియా, బ్రెజిల్​ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇదీ చూడండి:కరోనా టీకా సింగిల్​ డోస్​.. కేవలం 75 రూపాయలు!

ABOUT THE AUTHOR

...view details