అమెరికా ఆశ్చర్యపోయేలా.. చైనా(China missile) తొలిసారి అణు సామర్థ్యాలు ఉన్న ఓ హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష చేపట్టింది. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ఓ వార్తాపత్రిక వెల్లడించింది. చైనా(China missile) ఈ ప్రయోగం ఆగస్టులో జరిపిందని తెలిపింది యూకే దినపత్రిక ఎన్‌హెచ్‌కే వరల్డ్.
క్షిపణి (China missile news) గగనతలంలో తక్కువ ఎత్తు నుంచే ప్రయాణించిందని.. అయితే లక్ష్యం మాత్రం గురితప్పిందని వెల్లడించింది. ప్రయోగం విజయవంతం కాకున్నా హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీపై చైనా పురోగతి.. అమెరికాను షాక్‌కు గురిచేసిందని పేర్కొంది.