తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2020, 4:52 PM IST

ETV Bharat / international

తప్పును ఒప్పుకోవాలని అమెరికాపై చైనా ప్రతిదాడి

అమెరికపై చైనా మరోసారి మండిపడింది. కరోనా వైరస్​పై అగ్రరాజ్యం స్పందించిన తీరులో అనేక లోపాలున్నాయని విమర్శించింది. అమెరికా తన తప్పులను అంగీకరించాలని స్పష్టం చేసింది. చైనా వైరస్​కు సంబంధించి అనేక విషయాలను దాచిపెట్టిందని అమెరికా దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది బీజింగ్​.

China targets US coronavirus response
ఆ విషయంలో అమెరికాపై చైనా ప్రతిదాడి

అమెరికా-చైనా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కరోనా వైరస్​పై కీలక విషయాలను దాచిపెట్టిందంటూ చైనాపై అగ్రరాజ్యం దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాపై చైనా ప్రతిదాడికి దిగింది. వైరస్​పై అగ్రరాజ్యం స్పందించిన తీరులో అనేక లోపాలున్నాయని మండిపడింది. అమెరికా.. ముందు తన తప్పులను అంగీకరించాలని స్పష్టం చేసింది.

"అంతర్జాతీయ సమాజంతోపాటు సొంత ప్రజల గురించి అమెరికా ఆలోచిస్తుందని ఆలోచిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ విషయంలో దర్యాప్తు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయం తీసుకుంటే మంచిది."

- జెంగ్​ షుయాంగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి​

అమెరికా దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా చైనా మీడియా కథనాలు ప్రచురించడం ప్రారంభించింది. అమెరికాలోని రిపబ్లికన్లు.. చైనాపై ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నట్టు విమర్శించింది.

"అమెరికా నేతలు తమ సొంత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చైనాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ వైఖరితో వైరస్​తో ఇప్పటికీ పోరాడుతున్న వారికి నష్టం జరుగుతుంది. వైరస్​పై ప్రపంచ పోరు మరింత కష్టమవుతుంది."

--- జిన్​యూ, చైనా వార్తా సంస్థ.

ఇదీ చూడండి:-రష్యాపై కరోనా ప్రతాపం.. సైన్యంలో 874 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details