చంద్రుడిపైన ఉన్న మట్టి, రాళ్ల వంటి పదార్థాలను భూమిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో.. చైనా తొలి మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. హైనన్ రాష్ట్రంలోని.. వెంచాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి.. 'చాంగె-5' మిషన్ ప్రయోగించింది. లాంగ్ మార్చ్-5 రాకెట్ ద్వారా బీజింగ్ కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 4:30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టింది.
చైనా స్పేస్ చరిత్రలో 'చాంగె-5' మిషన్ క్లిష్టమైన, సవాలుతో కూడిన మిషన్. అంతేకాకుండా చంద్రుడిపై నమునాలను సేకరించేందుకు 40 ఏళ్ల తర్వాత పంపిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం గమనార్హం.
40 ఏళ్లకు ముందు అమెరికా, రష్యాలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేపట్టాయి.
ఈ ప్రయోగంలో లూనార్ ఆర్బిట్‌లో మానవరహిత డాకింగ్ వంటి క్లిష్టతరమైన విధానాలను ఎంచుకుంది చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఏఎస్ఏ). ఈ మిషన్ విజయవంతంగా పూర్తయింతే మానవ సహిత ప్రయోగాలకు పునాదులు పడుతాయని భావిస్తోంది.
ప్రయోగం వివరాలు..