తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా దూకుడు- 3 రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లు ప్రయోగం

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలతో పాటు పలు కీలక అంశాలను సమీక్షించేందుకు కొత్తగా మూడు రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లను(remote sensing satellite) ప్రయోగించింది చైనా. లాంగ్​మార్చ్​-2డీ రాకెట్​ను​ విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టినట్లు తెలిపింది(china satellite news).

remote sensing satellites
రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లు ప్రయోగం

By

Published : Nov 6, 2021, 11:45 AM IST

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా మూడు రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లను(remote sensing satellite) విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది. పశ్చిమ చైనాలోని సిచౌన్​ ప్రావిన్స్​, జిచాంగ్​ శాటిలైట్​ లాంఛ్​ కేంద్రం నుంచి ఈ ప్రయోగం(china satellite news) చేపట్టినట్లు వెల్లడించింది.

యోగాన్​-35 విభాగానికి చెందిన ఈ మూడు ఉపగ్రహాలను(remote sensing satellite china) లాంగ్​ మార్చ్​-2డీ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్లు పేర్కొంది చైనా అధికారిక మీడియా. లాంగ్​ మార్చ్​ సిరీస్​ రాకెట్స్​ ద్వారా చేపట్టిన 396వ మిషన్​గా తెలిపింది.

2019 మార్చిలో లాంగ్​ మార్చ్​-3బీ రాకెట్​ విజయవంతంగా(china satellite news) నింగిలోకి దూసుకెళ్లింది. అది చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300వ ప్రయోగంగా నిలించినట్లు పేర్కొంది. లాంగ్​ మార్చ్​ వాహక రాకెట్​ సిరీస్​ను చైనా ఎయిరోస్పేస్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ కార్పొరేషన్​ అభివృద్ధి చేసింది. చైనా చేపట్టిన మొత్తం ప్రయోగాల్లో ఈ రాకెట్ల ద్వారానే 96.4 శాతం పూర్తి చేయటం గమనార్హం. తొలి వంద ప్రయోగాలకు 37 ఏళ్లు పట్టగా.. తదుపరి వందకు 7.5 ఏళ్లు, ఆ తర్వాత నాలుగేళ్లలోనే మరో వంద ప్రయోగాలను చైనా చేపట్టింది.

ఇదీ చూడండి:ఆకాశవీధిలో 100ఎంబీపీఎస్​ నెట్- చైనా ప్రయోగం

ABOUT THE AUTHOR

...view details