ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుపట్టింది. ఈ చర్య అమెరికా ఏకపక్షవాదానికి నిదర్శనమని విమర్శించింది.
కరోనా వైరస్ మూలాలు తెలుసుకునేందుకుగాను డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం.. చైనాలో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాపై బీజింగ్ విమర్శలు గుప్పించింది.
"అంతర్జాతీయ కూటముల నుంచి, ఒప్పందాల నుంచి అర్థాంతరంగా వైదొలగడం అమెరికాకు మామూలే. తాజాగా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఆ దేశ ఏకపక్షవాదానికి నిదర్శనం."