తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా అధ్యక్షుడు​ కరోనా టీకా వేయించుకోరా? - Turkish President vaccination by china

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా తయారు చేసిన వ్యాక్సిన్​కు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం లభించిందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. అయితే.. చైనా అగ్రనేతలు టీకా తీసుకోవటంపై సమాచారం వెల్లడించేందుకు నిరాకరించింది.

China silent on why its top leaders are yet to take COVID-19 vaccine
జిన్​పింగ్​ కరోనా టీకా వేయించుకోరా?

By

Published : Jan 20, 2021, 9:52 PM IST

ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులు చైనా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్​లను తీసుకున్నట్లు ఆ దేశ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునైంగ్ తెలిపారు. చైనా తయారు చేసిన రెండు కొవిడ్​ వ్యాక్సిన్​లో ఒకదానిని ఇతర దేశాల నాయకులు ఎక్కువగా నమ్మి.. తీసుకున్నట్లుగా వెల్లడించారు. అయితే చైనా అగ్ర నాయకులు ఎవరూ ఇంతవరకు టీకా ఎందుకు తీసుకోలేదు అని స్థానిక మీడియా ప్రశ్నిస్తే.. దానిపై ఆమె స్పందించలేదు.

ఇప్పటికే చైనా తయారు చేసిన వ్యాక్సిన్​ను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, సీషెల్స్ అధ్యక్షుడు వేవెల్ రామ్‌కలవన్, యుఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్, ఇండోనేషియా నాయకులు టీకాలు వేయించుకున్నట్లు చునైంగ్ తెలిపారు.

చైనా టీకాకు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం లభించింది. ఇప్పటికే చాలా మంది ప్రపంచ స్థాయి నాయకులు టీకా తీసుకున్నారు. దేశంలో కొన్ని వర్గాల వారికి టీకా ఇస్తున్నాం. త్వరలోనే చైనా పౌరులందరికీ ఉచితంగా టీకా అందిస్తాం. అధ్యక్షుడు జిన్​పింగ్​​, ప్రధాని లీ కెకియాంగ్, ఇతర నాయకులు తీకున్నారా అనే ప్రశ్నకు ప్రస్తుతం నా దగ్గర సమాధానం లేదు. అయినా మన పోరాటం వైరస్​ మీద. అందుకు టీకా అనేది రక్షణ కవచం లాంటింది.

- హువా చునైంగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details