తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్ 'ల్యాబ్ లీక్'​పై చైనా స్వతంత్ర దర్యాప్తు?

'కరోనా వైరస్​ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు చైనా సహకరిస్తుందా?' ఈ ప్రశ్న ఆ దేశ విదేశాంగ శాఖకు ఎదురైంది. దీనికి చైనా ఏం సమాధానం చెప్పింది?

China silent on independent probe on charges of COVID-19 leak from Wuhan bio lab
కొవిడ్ 'ల్యాబ్ లీక్'​పై చైనా స్వతంత్ర దర్యాప్తు?

By

Published : May 26, 2021, 10:04 PM IST

వుహాన్​లోని వైరాలజీ ఇన్​స్టిట్యూట్ నుంచి కొవిడ్ లీక్ అయిందన్న ఆరోపణలపై చైనాకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విషయంపై స్వతంత్ర దర్యాప్తునకు అనుమతిస్తారా అనే ప్రశ్నకు ఆ దేశం బదులివ్వలేదు.

ల్యాబ్​ లీక్​ అంశం మరోసారి వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్​కు ప్రశ్నలు సంధించారు విలేకరులు. అయితే, వుహాన్​లో డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తును ప్రస్తావించిన ఆయన.. స్వతంత్ర దర్యాప్తు అంశంపై స్పందించలేదు. మౌనంగానే ఉండిపోయారు.

ఇదీ చదవండి-'వుహాన్​ ల్యాబ్​లో చైనా సైన్యం రహస్య ప్రయోగాలు'

కొవిడ్ గురించి బయటి ప్రపంచానికి తెలియక ముందే వుహాన్ ల్యాబ్​లో కొంతమంది పరిశోధకులు అస్వస్థకు గురయ్యారని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. వీరిందరిలో కొవిడ్‌19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్‌ వద్దకు ఈ సమాచారం ఒక నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామి నుంచి వచ్చింది. దీంతో వైరస్‌ ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.

మరోవైపు, డబ్ల్యూహెచ్ఓ సైతం వుహాన్​లో మరోసారి పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాబ్ లీకేజీ కోణంలో దర్యాప్తు చేయాలని అనుకుంటున్నట్లు సీఎన్ఎన్ వార్తా కథనం వెల్లడించింది.

ఇవీ చదవండి-

2019 అక్టోబర్​లోనే వుహాన్​లో కరోనా ఆనవాళ్లు!

చైనా బాగోతం బట్టబయలు- వుహాన్ మార్కెట్లో ఆధారాలు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details