చైనాలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. వుహాన్‌లో కరోనా తగ్గుముఖం పట్టిన చాలా నెలలు తర్వాత.. ఒక్క జనవరిలోనే 2,016 కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో 435మంది కరోనా బారిన పడినట్లు వివరించారు. అదే సమయంలో చాలా నెలల తర్వాత వైరస్‌తో ఇద్దరు మరణించారని తెలిపారు.
చైనాలో కరోనా అలజడి- ఒక్కనెలలో 2,016 కేసులు - చైనాలో జనవరిలో 2,016 కేసులు
చైనాలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. ఒక్క జనవరిలోనే 2వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. వుహాన్‌లో వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన నాటి నుంచి.. ఒక్క నెలలో ఇన్ని కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.
![చైనాలో కరోనా అలజడి- ఒక్కనెలలో 2,016 కేసులు China sees most monthly infections since March](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10450485-225-10450485-1612102873142.jpg)
చైనాలో మళ్లీ కరోనా పంజా- జనవరిలో 2,016 కేసులు
దీంతో కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు అధికారులు. వచ్చే లూనార్ న్యూ ఇయర్(ఫిబ్రవరి 12) సందర్భంగా ఎలాంటి వేడుకల్లో పాల్గొనవద్దని ప్రజలను సూచించారు. 75 శాతం రైళ్ల సేవలను సైతం నిలిపివేయనున్నట్లు తెలిపారు. కరోనా కేసుల్లో ఎక్కువభాగం ఉత్తరాది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :చైనాలో ఆ వెబ్సైట్లు మూసివేత
Last Updated : Jan 31, 2021, 10:42 PM IST