తెలంగాణ

telangana

ETV Bharat / international

'హాంకాంగ్​ అణచివేత'కు భారత్​ మద్దతు కోరిన చైనా - china india relations

హాంకాంగ్​పై పూర్తి అధికారాన్ని పొందే బిల్లుపై మద్దతు తెలపాలని భారత్​ను కోరుతోంది చైనా. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా చెబుతోంది.

CHINA-HK-INDIA
హాంకాంగ్​ అణచివేత'

By

Published : May 22, 2020, 6:44 PM IST

హాంకాంగ్​కు సంబంధించి కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలన్న వివాదాస్పద నిర్ణయానికి మద్దతు తెలపాలని భారత్​తో పాటు పలు దేశాలను కోరుతోంది చైనా. వేర్పాటువాద శక్తులను అణచివేసేందుకు రూపొందించిన ఈ బిల్లును అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తోంది.

హాంకాంగ్​ విషయంలో ఈ చట్టాన్ని ఉపయోగించటానికి గల కారణాన్ని వివరించింది చైనా. హాంకాంగ్​లోని పరిణామాలతో దేశ జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని చెబుతోంది.

"హాంకాంగ్​కు సంబంధించి దీర్ఘకాలిక స్థిరత్వానికి కృషి చేస్తాం. అంతర్జాతీయ సమాజ ప్రయోజనాలను కాపాడతాం. హాంకాంగ్​లోని మీ దేశాలకు సంబంధించిన అంశాలపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ విషయాన్ని మీ ప్రభుత్వం అర్థం చేసుకుని మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం."

- చైనా

హాంకాంగ్​ను పూర్తి నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తూర్పు ఆసియాలో హాంకాంగ్​ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది. చైనాకు ప్రత్యేక పరిపాలన ప్రాంతం (ఎస్​ఏఆర్​) గా ఉంది.

ప్రత్యేక ప్రతిపత్తితో ఇబ్బందులు...

అయితే తాజా చట్టంతో హాంకాంగ్​లోని ప్రత్యేక అధికారాలకు గండి పడనుంది. చైనా పీపుల్స్ కాంగ్రెస్​లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు చైనా కమ్యూనిస్టు పార్టీ చేతిలోని కీలుబొమ్మ సర్కారు ఆమోదం తెలిపింది.

అయితే ఇప్పటికే చైనా అధికార జోక్యంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన హాంకాంగ్ వాసులు ప్రస్తుతం ఎలాంటి స్పందిస్తారన్న విషయంపై ఆందోళన నెలకొంది. స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకుల భావన.

ఇదీ చూడండి:హాంకాంగ్​ హక్కులను హరించేలా చైనా కొత్త బిల్లు

ABOUT THE AUTHOR

...view details