కరోనా మహమ్మారి ఆవిర్భావంపై దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం చైనాకు గురువారం రానున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ వెల్లడించారు. వుహాన్లో నిపుణుల బృందం పర్యటించనున్నట్లు తెలిపారు. అక్కడే దర్యాప్తు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వివరించలేదు.
చైనాలో పర్యటించేందుకు నెలల నుంచి ఎదురుచూస్తోంది డబ్ల్యూహెచ్ఓ. పర్యటనకు అడ్డంకులు ఎదురవడం పట్ల సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన టెడ్రోస్.. తొలి కేసు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.