తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా వల్లనే 'కరోనా' భయం.. చైనా మండిపాటు - చైనా కరోనా

కరోనా విషయంలో అమెరికా చర్యలు భయాల్ని పెంచుతున్నాయని చైనా ఆరోపించింది. చైనా యాత్రికులను నిషేధించటంపై ఆవేదన వ్యక్తం చేసింది. వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవటానికి చైనాలో భారీ సంఖ్యలో మాస్కులు అవసరమున్నాయని ప్రకటించింది.

CHINA-VIRUS-US
CHINA-VIRUS-US

By

Published : Feb 3, 2020, 3:08 PM IST

Updated : Feb 29, 2020, 12:23 AM IST

కరోనా వైరస్​కు సంబంధించి అమెరికా చర్యలు భయాన్ని సృష్టిస్తున్నాయని చైనా ఆరోపించింది. చైనా యాత్రికులపై నిషేధం విధించటాన్ని ఆక్షేపించారు డ్రాగన్​ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్​యింగ్​.

"కరోనా విషయంలో అమెరికా ఎలాంటి సాయం చేయలేదు. కానీ భయాన్ని మాత్రం పెంచుతోంది. "

- హువా చున్​యింగ్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

అమెరికాలో 8 కరోనా కేసులను గుర్తించింది ఆ దేశం. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితిని శుక్రవారం ప్రకటించింది అగ్రరాజ్యం. అంతేకాకుండా చైనా నుంచి వచ్చే విదేశీయులపై తాత్కాలిక నిషేధం విధించింది. అమెరికన్లనూ 14 రోజల పర్యవేక్షణలో ఉంచుతోంది.

మాస్కుల కొరత

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు మాస్కులు, ప్రత్యేక సూట్ల కొరత ఉందని హువా వెల్లడించారు. చైనాను కరోనా కలవరపెడుతున్న వేళ మాస్కుల కొరతతో ఆందోళన నెలకొంది. ఇప్పటికే చైనాలో 17 వేల కేసులను గుర్తించారు.

ఈ నేపథ్యంలో చైనాలోని 140 కోట్ల మందికి సరిపడా మాస్కులు లేవని.. అత్యవసరంగా వీటిని తెప్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు హువా.

"మాస్కులు, ప్రత్యేక సూట్లు, కళ్లద్దాల కొరత ఉంది. అత్యవసరంగా వీటిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. "

- హువా చున్​యింగ్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

చైనాలో కర్మాగారాల ద్వారా రోజుకు 2 కోట్ల మాస్కులను తయారు చేయగలమని ఆమె చెప్పారు. దక్షిణ కొరియా, జపాన్​, కజకిస్థాన్​ నుంచి వైద్య పరికరాలు దిగుమతి చేసుకున్నామన్నారు. ఐరోపా, అమెరికా నుంచి మరిన్ని దిగుమతి చేయిస్తామన్నారు.

చైనాలో కరోనా ధాటికి 361 మంది మృత్యువాత పడ్డారు. 2002లో చైనాను వణికించిన సార్స్​తో పోలిస్తే ఈ సంఖ్యతో పాటు ప్రభావం ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు.

Last Updated : Feb 29, 2020, 12:23 AM IST

ABOUT THE AUTHOR

...view details