తెలంగాణ

telangana

'హాంకాంగ్​' అంశంలో అమెరికా ఏం చేయలేదు: చైనా

తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని చైనా పేర్కొంది. హాం​కాంగ్​కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తున్నట్లు అగ్రరాజ్యం చేసిన ప్రకటనపై చైనా ఈ మేరకు వ్యాఖ్యానించింది.

By

Published : May 30, 2020, 4:29 PM IST

Published : May 30, 2020, 4:29 PM IST

China says US action on Hong Kong 'doomed to fail'
'హాంగ్​కాంగ్​పై అమెరికా చర్యలు తప్పక విఫలమవుతాయి'

హాం​కాంగ్​కు ఇచ్చిన ప్రత్యేక హోదాకు స్వస్తి పలకనున్నట్టు అమెరికా చేసిన ప్రకటనపై చైనా తీవ్రంగా మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటుందని.. ఈ చర్యలు తప్పక విఫలమవుతాయని చైనా కమ్యూనిస్ట్​ పార్టీ అధికార పత్రిక పీపుల్స్​ డైలీ పేర్కొంది.

"హాంకాంగ్​, చైనా అంతర్గత వ్యవహారాలపై అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటోంది. వీటికీ చైనా ప్రజలు భయపడరు. అమెరికా ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయి."

--- పీపుల్స్​ డైలీ

హాంకాంగ్‌ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంటు 'నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌' గురువారం ఆమోదించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984లో బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందానికి చైనా తూట్లు పొడిచిందన్నారు. హాం​కాంగ్​కు ఇస్తున్న ప్రత్యేక హోదాను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పీపుల్స్​ డైలీ ఈ కథనం ప్రచురించింది.

కరోనా వైరస్​ వ్యాప్తిపై అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇప్పుడు హాం​కాంగ్​ అంశం ఇరుదేశాల మధ్య మరింత అగ్గి రాజేసింది.

భద్రతా మండలి సమావేశంలో...

హాం​కాంగ్​పై చైనా తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లును అమెరికా, బ్రిటన్​లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ప్రస్తావించాయి. అనధకారిక వీడియో సమావేశం వేదికగా చైనాపై అమెరికా మండిపడింది.

"మండలి సభ్యులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మిలియన్ల మంది హాం​కాంగ్​ ప్రజలు ఇన్ని రోజులు గౌరవప్రదమైన జీవితాలను గడిపారు. వారి హక్కులను కాపాడేందుకు మనం ఏదైనా చర్యలు తీసుకుంటామా? లేక అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ.. హాం​కాంగ్​ ప్రజల హక్కులను కాలరాసేందుకు చైనాకు అనుమతులిస్తామా? తమ స్వేచ్ఛను రక్షించాలని హాం​కాంగ్​ ప్రజలు మనవైపు చూస్తున్నారు. వారి స్వేచ్ఛను హరింపజేసే హక్కును చైనాకు ఇద్దామా?"

--- కెల్లి క్రాఫ్ట్​, అమెరికా తరఫున ఐరాస రాయబారి.

ఈ విషయంపైనా చైనా ఘాటుగానే స్పందించింది. అమెరికాలో నల్లజాతీయుడిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేయడానికి ట్రంప్​ ప్రభుత్వం బలగాలను ఉపయోగిస్తోందని.. ముందు ఆ విషయంపై దృష్టి సారించాలని హితవు పలికింది.

ABOUT THE AUTHOR

...view details