తెలంగాణ

telangana

ETV Bharat / international

'డబ్ల్యూహెచ్​ఓ విషయంలో ట్రంప్ హడావుడి అందుకే' - trump threatens who news

కరోనా కట్టడి విషయంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతున్నారని చైనా ఆరోపించింది. శాశ్వతంగా నిధులు నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఈమేరకు స్పందించింది.

China says Trump's threat to pull out of WHO an attempt to shift blame on COVID-19
'వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ట్రంప్ బెదిరింపులు'

By

Published : May 19, 2020, 6:18 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థకు శాశ్వతంగా నిధుల నిలిపివేసి, సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ హెచ్చరించడంపై చైనా మండిపడింది. అగ్రరాజ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడిలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. ప్రపంచం దృష్టిని దారిమళ్లించాలని చూస్తున్నారని ధ్వజమెత్తింది.

రానున్న 30 రోజుల్లో డబ్ల్యూహెచ్‌ఓ వైఖరి మార్చుకోకపోతే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల్ని శాశ్వాతంగా ఆపేస్తానని ట్రంప్​ హెచ్చిరించిన కొద్దిసేపటికే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావ్ లిజియ్​న్​ స్పందించారు. చైనాను సమస్యగా చూపి అంతర్జాతీయ సంస్థకు అందించాల్సిన బాధ్యతాయుతమైన సాయాన్ని నిలిపివేసేందుకు ట్రంప్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్​కు ట్రంప్ రాసిన లేఖ అస్పష్ట వైఖరిని కనబరుస్తోందని విమర్శించారు.

అమెరికాలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేని ట్రంప్​, ప్రజలను దారిమళ్లించేందుకు చైనాపై ఆరోపణలు చేస్తూ డబ్ల్యూహెచ్​ఓను బెదిరిస్తున్నారని అన్నారు జావ్. ఈ రాజకీయ క్రీడలను అమెరికా ఆపివేయాలని సూచించారు. అధనోమ్​ తన విధులను చక్కగా నిర్వర్తించారని కొనియాడారు.

డబ్ల్యూహెచ్​ఓకు సభ్య దేశాలన్నీ నిధులిస్తాయని, కరోనాపై పోరులో భాగంగా చైనా ఇప్పటికే 50 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు జావ్​. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాలను ఆదుకునేందుకు 2 బిలియన్​ డాలర్లు కేటాయిస్తామని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ప్రకటించినట్లు గుర్తుచేశారు.

కరోనా నియంత్రణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు ట్రంప్. సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌పై నేరుగా విమర్శలు గుప్పిస్తూ లేఖ రాశారు. చైనాతో అంటకాగడం ఆపి స్వతంత్రంగా వ్యవహరిస్తేనే సంస్థకు మేలైన బాటలు పడతాయని హితవు పలికారు. డబ్ల్యూహెచ్‌ఓను చైనా కీలుబొమ్మగా అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details