ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంపై చైనా మండిపడింది. చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ట్రంప్ ఆరోపణలన్నీ 'రాజకీయ లబ్ధికోసం చేసిన కల్పిత అబద్దాల'ని తిప్పికొట్టింది.
ఇదీ చదవండి: చైనాను జవాబుదారీ చేయాల్సిందే: ట్రంప్
ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్ చేసిన ప్రసంగం వాస్తవాలను విస్మరించేదిగా ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసేందుకు ట్రంప్ ఐరాస వేదికను ఎంచుకోవడంపై మండిపడ్డారు.
"చైనాకు వ్యతిరేకంగా చేసిన నిరాధారమైన ఆరోపణలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అబద్దాలను ఏ విధంగానూ నిజాలుగా మార్చలేరు. కొవిడ్‌ను నియంత్రించడంలో చైనా రికార్డు ఏంటో ప్రపంచానికి తెలుసు. మానవాళి అంతటికీ వైరస్ ఉమ్మడి శత్రువు. చైనా కూడా వైరస్ బాధిత దేశమే. మహమ్మారి వ్యతిరేక పోరులో ప్రపంచంతో పాటు చైనా పోరాడింది."