కరోనా మూలాలను కనుగొనేందుకు మరో విడత దర్యాప్తు చేపడతామన్న డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై చైనా స్పందించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన తమను.. షాక్‌కు గురిచేసిందని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి జెంగ్ యిక్సిన్ గురువారం వ్యాఖ్యానించారు. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందన్న వాదనలను కొట్టిపారేశారు. ఈ వదంతులు సైన్స్‌కు విరుద్ధమైనవని పేర్కొన్నారు.
మహమ్మారికి చైనాలోని వుహాన్ ల్యాబే మూలం అనే వాదన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మొదలైంది. చైనా వుహాన్ ల్యాబ్‌లో కరోనాకు సంబంధించి ఉన్న వివరాలను తొలగించే ప్రయత్నం చేస్తోందన్న కథనాలు ఈ వాదనలకు బలం చేకూర్చాయి. డబ్ల్యూహెచ్ఓ మొదట ఈ వాదనలను తోసిపుచ్చినా.. ప్రపంచ దేశాల ఒత్తిడితో వైరస్ మూలాలు తెలుసుకునేందుకు చైనాలో పర్యటన చేపట్టింది. అయితే ఆ పర్యటనలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల ప్రపంచ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
మరోసారి..